లోక్‌సభలో నవ్వులు పూయించిన అఠవాలే | Ramdas Athawale Comedy Speech in Parliament | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో నవ్వులు పూయించిన అఠవాలే

Jun 20 2019 3:37 AM | Updated on Jun 20 2019 3:37 AM

Ramdas Athawale Comedy Speech in Parliament - Sakshi

ఆర్‌పీఐ అధ్యక్షుడు రాందాస్‌ అఠవాలే

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ అధ్యక్షుడు రాందాస్‌ అఠవాలే బుధవారం లోక్‌సభలో తన మాటలతో ప్రధాని మోదీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌  ముఖాల్లో నవ్వులు పూయించారు. ‘రాహుల్‌ గారు, ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం మీకు వచ్చినందుకు అభినందనలు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు నేను మీ కూటమిలోనే ఉన్నాను. తాజా ఎన్నికలకు ముందు కూడా మళ్లీ యూపీఏలో చేరాల్సిందిగా కాంగ్రెస్‌ నేతలు నన్ను కోరారు. అయితే గాలి ఎటువైపు వీస్తోందో నేను గమనించి, ఎన్డీయేతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని అఠవాలే అన్నారు. ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకున్న రాహుల్, సోనియాలు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అఠవాలే మాట్లాడుతుండగా మోదీ కూడా పలుసార్లు నవ్వారు. మోదీ మరో ఐదేళ్లు అధికారంలో ఉండి మంచిపనులు చేస్తారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement