రాహుల్‌కి కమల్‌ స్పెషల్‌ ట్వీట్‌ | Rahul to Kamal Special Tweet | Sakshi
Sakshi News home page

రాహుల్‌కి కమల్‌ స్పెషల్‌ ట్వీట్‌

Dec 16 2017 1:54 PM | Updated on Mar 18 2019 9:02 PM

Rahul to Kamal Special Tweet - Sakshi

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌గాంధీకి అభినందనల వెల్లువ మొదలైంది. ఇప్పటికే  సోషల్‌  మీడియా ద్వారా రాహుల్‌కు పలువురు కీలక నేతలు, కార్యకర్తల శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.   ముఖ్యంగా  సినీ రంగంనుంచి మొదటిసారిగా నటుడు కమల్‌ హాసన్‌ రాహుల్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఇప్పటికే రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలతో  వార్తల్లో నిలుస్తున్న కమల్‌  కాంగ్రెస్‌ అధ్యక్షుడికి విషెస్‌ తెలపడం ఆసక్తికరంగా మారింది.  రాహుల్‌కు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్‌ చేశారు.    కాంగ్రెస్‌ నాయకులంటే తనకు ఎనలేని గౌరవమని. ఆ గౌరవాన్ని రాహుల్‌ గాంధీ తప్పక నిలబెడతారనే విశ్వసాన్ని కమల్‌ వ్యక్తం చేశారు.


రాహుల్‌ జీ మీకు శుభాకాంక్షలు. మీ పదవి మిమ్మల్ని నిర్దేశించలేదు. కానీ.. మీరే మీ బాధ్యతలను, స్థానాన్ని నిర్వచించగలరు.. మీ పెద్దలంటే నాకు ఎంతో అభిమానం.. మీరు కూడా నా ప్రశంసలు పొందేలా పని చేస్తారనే నమ్మకం నాకు ఉంది.. అంతటి సామర్ధ్యం మీ భుజాలకుందంటూ కమల్‌  ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement