తెలంగాణకు ఏమీ సాధించలేకపోయారు | ponguleti sudhakar reddy on telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ఏమీ సాధించలేకపోయారు

Feb 5 2018 3:54 AM | Updated on Feb 5 2018 3:54 AM

ponguleti sudhakar reddy on telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన విభజన హామీలను సాధించ లేకపోయిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు పరిశ్రమ, హైకోర్టు విభజన, ఎయిమ్స్‌కు నిధులు, నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు ప్రాజెక్టులకు నిధులు సాధించుకోలేకపోయారని విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెబుతున్న కేసీఆర్‌కు కేంద్రంలోని మోదీ సర్కారుతో ఉన్న లోపాయికారి ఒప్పందాలేంటో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement