
సాక్షి, హైదరాబాద్: టీడీపీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న సీనియర్ నేత రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. నగరంలోని జలవిహార్‌లో సోమవారం తన సన్నిహితులు, కార్యకర్తలు, మద్దతుదారులతో సభ నిర్వహించేందుకు రేవంత్‌రెడ్డి సన్నాహాలు ప్రారంభించారు. అయితే, జలవిహార్‌లో రేవంత్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఇక్కడ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వద్దే సమావేశానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.