రాహుల్‌కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

PM Modi wishes Rahul Gandhi on his birthday - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు రాహుల్‌. మీరు మంచి ఆరోగ్యంతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా’అని మోదీ బుధవారం ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. తొలుత రాహుల్‌ యూపీఏ చైర్‌పర్సన్, తన తల్లి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నారు.

అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో గడిపారు. రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్, కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, డీఎంకే అధినేత స్టాలిన్‌ తదితరులు ఉన్నారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ రాహుల్‌ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నేతలతో కలిసి ఉన్న ఫొటోలను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. బిహార్‌లో మెదడువాపు వ్యాధితో దాదాపు 120 మంది చిన్నారులు మరణించిన నేపథ్యంలో ఈసారి రాహుల్‌ పుట్టినరోజు నాడు కేక్‌ కట్‌ చేయలేదని పార్టీ కార్యకర్తలు వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top