వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చుట్టూ టీడీపీ నేతలు | Peedika Rajanna Dora Comments | Sakshi
Sakshi News home page

టీడీపీలో చేరాలంటూ ప్రలోభాలు

Apr 23 2018 9:53 AM | Updated on May 29 2018 2:33 PM

Peedika Rajanna Dora Comments - Sakshi

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర

సాలూరు (విజయనగరం) : తనను టీడీపీలో చేరాలంటూ ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. ఆదివారం తన స్వగృహంలో పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇదివరకు కొంత మంది ఎమ్మెల్యేలను కొన్న టీడీపీ నాయకులు తనను కూడా కొనుగోలు చేయాలని నెలరోజులుగా తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వెల్లడించారు. గత రాత్రి కూడా తనను సంప్రదించారని చెప్పారు. నేను చెప్పింది అవాస్తవమని టీడీపీ నాయకులు ఖండిస్తే బోసుబొమ్మ జంక్షన్‌లో బహిరంగంగా విషయాలన్నింటినీ వెల్లడిస్తానని స్పష్టం చేశారు. టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పేముందని ఎమ్మెల్సీ సంధ్యారాణి వ్యాఖ్యానించడాన్ని రాజన్నదొర తప్పుబట్టారు. భారత రాజ్యాంగంపై అవగాహన లేకుండా, ప్రజాప్రాతినిథ్య చట్టం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement