'అజిత్, ఫడ్నవీస్‌ మైత్రి ముందే తెలుసు'

Pawar Gave Statement About Relationship Between Ajit Pawar And Fadnavis - Sakshi

ముంబై: బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్‌తో అజిత్‌ పవార్‌ సన్నిహితంగా మెలుగుతున్న విషయం నవంబర్‌ 23వ తేదీనాటి పరిణామాలకు ముందే తనకు తెలుసునని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ వెల్లడించారు. కలిసి పనిచేద్దాం రమ్మంటూ ప్రధాని మోదీ ఆహ్వానించారని సోమవారం మీడియాకు వెల్లడించిన పవార్‌ మంగళవారం మరో సంచలన వ్యాఖ్య చేశారు. బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణ స్వీకారం చేయకమునుపే వారిద్దరి మధ్య చర్చల వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు.

అయితే, అజిత్‌ నడిపించిన తంతు అంతా తనకు తెలిసే జరిగిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. నవంబర్‌ 23వ తేదీనాటికే శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖరారైందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.  కాంగ్రెస్‌తో చర్చలు జరపడం అజిత్‌కు ఇష్టం లేదు.. అయితే, అనంతరం అజిత్‌ అలా చేస్తాడని ఊహించలేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top