బొంబాయిలో అంతే.. బొంబాయిలో అంతే: పవన్‌ | Pawan Kalyan Slams TDP backed media channels | Sakshi
Sakshi News home page

బూతు రత్నంపై పవన్‌ సెటైరికల్‌ పోస్టు!

Apr 24 2018 3:41 PM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Slams TDP backed media channels - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. తనపై కుట్రలు చేస్తున్నారంటూ ఓ వర్గం మీడియాపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ అనుకూల మీడియా చానెళ్లు, వాటి అధినేతలను ఉద్దేశించి పవన్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘టీడీపీ మద్దతుతో నడుస్తున్న మీడియా చానెళ్ల అధినేతలు, వాటి వాటాదారులు, పెట్టుబడిదారులు, బోర్డులకు మేం లీగల్‌ నోటీసులు ఇవ్వబోతున్నాం. ఈ నోటీసులపై స్పందించేందుకు వారికి తగినంత సమయం ఇస్తాం’ అని పవన్‌ ట్వీట్ చేశారు.

‘బొంబాయిలో అంతే.. బొంబాయిలో అంతే’ అంటూ ‘బూతురత్నం’పై సెటైరికల్‌ కామెంట్‌ను పవన్‌ ట్వీట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ తల్లిని దూషించే తిట్టు పల్లెటూళ్లలో చాలా సర్వసాధారణమని ‘బూతురత్నం’ అంటున్నాడని, మరీ ఈ లాజిక్‌ను బట్టి ఇతనిని ప్రజలందరూ అలా పిలిచినా తప్పు అనుకోడు.. అంటూ ఎద్దేవా చేస్తూ ఉన్న కామెంట్‌ను ఆయన స్మైలీ ఎమోజీతో షేర్‌ చేశారు. ‘మొదట వాళ్లు కమ్యూనిస్టుల కోసం వచ్చారు.. నేను కమ్యూనిస్టును కాకపోవడంతో మాట్లాడలేదు’ అంటూ ప్రఖ్యాత రచయిత మార్టిన్‌ నీమోలెర్‌ కవితను పవన్‌ షేర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement