హిందూ మతంపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు | Pawan Kalyan Sensational Comments On Hindu Religion | Sakshi
Sakshi News home page

హిందూ మతంపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Dec 2 2019 7:57 PM | Updated on Dec 2 2019 9:25 PM

Pawan Kalyan Sensational Comments On Hindu Religion - Sakshi

సాక్షి, తిరుపతి :  హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని వ్యాఖ్యానించారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్‌ ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని అన్నారు.

అలాగే టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని ఆరోపించారు. హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని..సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. మిగతా మతాల వారు ఇలాంటి పనులు చేయరని చెప్పారు. కాగా, పవన్‌ హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement