జగన్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని అభినందిస్తున్నా | Pawan Kalyan Comments On Handing over of Sugali Preethi case to CBI | Sakshi
Sakshi News home page

జగన్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని అభినందిస్తున్నా: పవన్‌ కల్యాణ్‌

Feb 29 2020 5:30 AM | Updated on Feb 29 2020 2:01 PM

Pawan Kalyan Comments On Handing over of Sugali Preethi case to CBI - Sakshi

సాక్షి, అమరావతి: సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. మూడేళ్ల కిందట పాఠశాలకు వెళ్లిన ప్రీతి అత్యాచారం, హత్యకు గురైందని, ఆమె తల్లిదండ్రులు కడుపు కోత, ఆవేదనకు గురయ్యారని పేర్కొన్నారు. తమ బిడ్డ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పడిన కష్టం పగవాడికి కూడా రాకూడదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement