ఒకరికొకరు టచ్‌లో విపక్ష నేతలు

Opposition parties plan letters for President - Sakshi

ఎన్డీయేకి మెజారిటీ రాకపోతే వెంటనే రాష్ట్రపతికి లేఖ

న్యూఢిల్లీ: ఒకవేళ ఎన్డీయేకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రానిపక్షంలో, వెంటనే స్పందించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేందుకు వీలుగా ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు ఒకరితో మరొకరు టచ్‌లో ఉండనున్నారు.  విపక్షాలన్నిటినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు వీలుగా నిరంతర సంప్రదింపుల్లో ఉండాలని ఎన్డీయేతర పార్టీల నేతలు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాల కథనం ప్రకారం.. ఎన్డీయేకి మెజారిటీ రాని పక్షంలో తమను ఒక సముదాయం (బ్లాక్‌)గా పేర్కొంటూ విపక్షాలు రాష్ట్రపతికి ఒక లేఖ రాస్తాయి. ఏకైక అతిపెద్ద పార్టీ విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరతాయి. ఈ మేరకు విపక్ష పార్టీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించాయి.  

ఎన్నికల బరిలో 724 మంది మహిళలు
సార్వత్రిక ఎన్నికల బరిలో 8,049 మంది అభ్యర్థులు ఉండగా, వీరిలో 724 మంది మహిళలు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు తెలిపాయి. 17వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధికంగా 54 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దించగా, బీజేపీ 53 మందితో రెండో స్థానంలో నిలిచింది. బీఎస్పీ 24 మంది మహిళా అభ్యర్థులతో మూడో స్థానంలో ఉంది. 222 మంది మహిళలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top