
అనంతపురం, శింగనమల: మండలంలోని నాయనవారిపల్లి గ్రామ రోడ్డు కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం ఇది. ఈనెల 2న ఎమ్మెల్యే యామినీబాల ఇక్కడ భూమి పూజ చేశారు. అయితే రెండు కడ్డీలు కట్టించి అందులో శిలాఫలకాన్ని ఉంచారు. రూ.1.26 కోట్లు మంజూరైనట్లు అందులో పొందుపర్చారు. రోడ్డు వేస్తామని గతంలో ఎమ్మెల్యే హామీ ఇవ్వడం.. ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడటంతోనే తాత్కాలిక శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారన్న చర్చ జరుగుతోంది.