బీసీ రిజర్వేషన్లు సాధిస్తేనే విజయం

Mla srinivas goud comments on bc reservations - Sakshi

ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ 

హైదరాబాద్‌: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల సాధనే అసలు విజయమని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన బుధ వారం ‘అసెంబ్లీ సమావేశాల్లో బీసీ డిమాండ్లపై చర్చ’అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.  ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ... బీసీ ఫెడరేషన్లు ఉంటాయని సీఎం కేసీఆర్‌హామీ ఇచ్చారని, వాటికి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు పొందితేనే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ.. బీసీలంతా పార్టీలకతీతంగా ఐకమత్యంగా ఉండాలని, బీసీలు ఏ రంగంలో ఉన్నా వారిని ప్రోత్సహించాలన్నారు. 

నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వాలి: జాజుల 
ఇప్పటి వరకూ అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలకు నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.  అన్ని రంగాల్లోనూ జనా భా ఆధారంగా బీసీలకు వాటాను కల్పించాలన్నారు. సమావేశంలో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్, ఎంబీసీ కులాల అధ్యక్షుడు దాసన్న, గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.ఎల్‌ మల్లయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గణేశ్‌ చారి, తెలంగాణ సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు నర్సింహ్మ సాగర్, బోయ వాల్మీకి సంఘం అధ్యక్షుడు గోపి, బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top