చంద్రబాబు క్షమాపణ చెప్పాకే.. బయటకు కదలాలి

Ministers Lashes Out At Chandrababu Comments On IAS Vijay kumar - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపె విశ్వరూప్‌, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌ తీవ్రంగా ఖండించారు. ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా మంత్రులు ఆదివారం ఓ ప్రకటన చేశారు.

బీసీజీ నివేదికను మున్సిపల్‌శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి  విజయ్‌కుమార్‌ ఒక ఐఏఎస్‌గా, ప్రభుత్వాధికారిగా, తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించడం జరిగింది.  ఆ నివేదిక మీద చంద్రబాబు నాయుడు చేసిన విమర్శుల చవకబారుగా ఉన్నాయనుకుంటే అంతకుమించి ఆయనను, విజయ్‌కుమార్‌ గాడు అనడంద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు, బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళలమీద చేయిచేసుకోవడం లాంటి సంఘటనలతో పలుమార్లు కులపరంగా తనకున్న దురహంకారాన్ని బయటపెట్టుకున్నారు. అధికారిగా విజయ్‌కుమార్‌ బాధ్యతలు ఏంటో ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఉద్దేశ పూర్వకంగా విజయ్‌కుమార్‌గాడు అని సంబోధించడం ద్వారా తనను ఏ వ్యవస్థలూ ఏమీ చేయలేవు, అన్ని వ్యవస్థలనూ నేను మేనేజ్‌ చేస్తున్నాను అనే అహంకార పూరిత వైఖరిని కూడా చంద్రబాబు ప్రదర్శించారు. 

40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు భాషా సంస్కారంగాని, కులపరమైన సంస్కారం గాని, సామాజిక న్యాయంపట్ల గౌరవం గాని, భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం గాని లేవని మరోసారి స్పష్టమైన నేపథ్యంలో ఆయనను, ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టుగా అంబేద్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లి పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాం. 

అంతేకాకుండా స్వయంగా విజయ్‌కుమార్‌ వద్దకు వెళ్లి, ఆయనకు కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాం. ఇది జరిగేవరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా, అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు వీరుమాత్రమే కాకుండా శాంతి భద్రతలను గౌరవించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును ఛీ కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం’  మంత్రులు అని పేర్కొన్నారు.

చదవండి: 

విజయకుమార్గాడు మాకు చెబుతాడా!

మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు

బోస్టన్ కమిటీ నివేదిక అద్భుతం..

బాధ తక్కువ.. బాగు ఎక్కువ

అమరావతి.. విఫల ప్రయోగమే

పొరపాట్లు మళ్లీ జరగకూడదు

సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు..

మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన

పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు..

మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top