విజయకుమార్‌గాడు మాకు చెబుతాడా!

Chandrababu comments on IAS officer Vijay Kumar - Sakshi

ఐఏఎస్‌ అధికారిపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు 

బీసీజీ నివేదిక చిత్తు కాగితం 

దీనికంటే మా విజన్‌ డాక్యుమెంటే బెటర్‌ 

సాక్షి, అమరావతి : ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూపు (బీసీజీ) నివేదికలోని వివరాలను మీడియాకు వివరించిన ఆయన్ను తప్పుపడుతూ ‘అమరావతిని ఫెయిల్యూర్‌ నగరాలతో పోలుస్తారా? విజయ్‌కుమార్‌గాడు మాకు చెబుతాడా’.. అంటూ చిందులు తొక్కారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. బీసీజీ నివేదికపై ఆరోపణలు చేశారు. బీసీజీ ఒక కంపెనీయే కాదని, ఎవరు డబ్బులిస్తే వారు చెప్పినట్లు రాసిస్తారని, అది చిత్తు కాగితమని విమర్శించారు. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి చెందిన సంస్థని ఆరోపించారు. అమరావతి విఫలమవుతుందంటున్నారని, కొత్త నగరాలు సైబరాబాద్, నవీ ముంబై, డెహ్రాడూన్‌ అభివృద్ధి చెందలేదా అని ప్రశ్నించారు. బీసీజీ ఇచ్చిన నివేదిక కంటే తాము తయారుచేసిన విజన్‌ డాక్యుమంట్‌ బెటరని, దాన్ని చదువుకోవాలన్నారు.

పట్టణీకరణ ద్వారానే ఉపాధి వస్తుందని, సంపద సృష్టించవచ్చని స్పష్టంచేశారు. జగన్‌ సొంతంగా సంపాదించి అమరావతిలో ఇల్లు కట్టారా.. అమరావతిలో జగన్‌ ఇల్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్‌ వేర్వేరు ప్రాంతాల్లో లేవన్నారు. అమరావతిలో కట్టడాలకు ఎక్కువ ఖర్చవుతుందని అబద్ధాలు చెబుతున్నారని.. హైదరాబాద్, చెన్నై కంటె అమరావతిలోనే తక్కువ ఖర్చవుతుందన్నారు. రాజధానిని విశాఖపట్నానికి తరలించినా అక్కడ మళ్లీ రైతుల భూముల కొనాల్సిందేనని తెలిపారు. ఎమర్జెన్సీ అసెంబ్లీ అంటున్నారని.. ఆ మాట తానెప్పుడూ వినలేదనన్నారు. అజేయ కల్లం చెప్పినట్లు రాసిచ్చానని జీఎన్‌ రావు చెప్పాడని చంద్రబాబు ఆరోపించారు. జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను భోగి మంటల్లో తగలబెట్టాలని, సంక్రాంతి పండుగను అమరావతి సంక్రాంతిగా జరుపుకోవాలన్నారు.

 

చదవండి:

మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు

బోస్టన్ కమిటీ నివేదిక అద్భుతం..

బాధ తక్కువ.. బాగు ఎక్కువ

అమరావతి.. విఫల ప్రయోగమే

పొరపాట్లు మళ్లీ జరగకూడదు

సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు..

మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన

పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు..

మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top