బోస్టన్‌ కమిటీ అత్యున్నత ప్రమాణాలు గల సంస్థ

AU VC Prasada Reddy Said Boston Committee Is High Quality Organization - Sakshi

ఏయూ వీసీ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద రెడ్డి

సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయంగా బోస్టన్ కమిటీకి అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థగా పేరు ఉందని... ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కి బీసీజీ అద్భుతమైన నివేదికను అందజేసిందని విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీలుగా బీసీజీ నివేదిక ఉందన్నారు. ఒక్క నగరం నిర్మాణానికే లక్షకోట్లను వెచ్చించడానికి బదులు...ఆ నిధులను అన్ని ప్రాంతాలకు సమానంగా వినియోగించడం... సాగునీటి రంగానికి ప్రాధాన్యతనివ్వడం వంటివి బీసీజీ‌ నివేదికలో ఇచ్చారని తెలిపారు. అమరావతి నిర్మాణాలకి అనుకూలం కాదని మద్రాస్ ఐఐటి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తెలిపిందని... అమరావతి ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగే విధంగా బీసీజీ‌ నివేదిక ఉందని ప్రసాద రెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top