టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి: రేవంత్‌రెడ్డి

Malla Reddy Does Not Have Dare To Go KCR Ahead: Revanth Reddy - Sakshi

సాక్షి, కీసర(రంగారెడ్డి) : ప్రజలను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మున్సిపల్‌ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు  కూన శ్రీశైలంగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రజలకు ఇచి్చన ఏ ఒక్కహామీని కూడా నెరవేర్చలేదన్నారు.  నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రజలకు పెనుశాపంగా మారిన డంపింగ్‌యార్డును తరలించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.ఆరీ్టసీ చార్జీలు, మద్యం ధరలను పెంచిన టీఆర్‌ఎస్‌ను వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిస్తే కరెంటు చార్జీలు, ఇంటిపన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతుందన్నారు. (మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా.)

సీఎం కేసీఆర్‌ ముందుకెళ్లే దమ్ము మంత్రి మల్లారెడ్డికే లేదని,  ఇక ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బుల ఆశ చూపించి ఓట్లు  దండుకునేందుకు వస్తారని, వారు ఇచ్చే డబ్బు తీసుకొని  ప్రజల సమస్యలపై పోరాటం చేసే కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఓటు వేసే ముందు ఓటర్లంతా ఆలోచించి మంచినాయకులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్,  జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌లు మాట్లాడుతూ  అప్పటి సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారన్నారు. కానీ మన ముఖ్యమంత్రి  కేసీఆర్‌ మాత్రం  ఫాంహౌస్‌కే పరిమితమయ్యాడన్నారు. సమావేశంలో మున్సిపల్‌ ఎన్నిలక ఇన్‌చార్జ్‌ వేణుగోపాల్,  జెడ్పీలో కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌  సింగిరెడ్డి హరివర్థన్‌రెడ్డి, నాగారం దమ్మాయిగూడ మున్సిపాలిటీల కాంగ్రెస్‌ నేతలు ముప్పురాంరెడ్డి, చిన్నమరాజు ప్రభాకర్‌గౌడ్, సురకంటి శ్రీకాంత్‌రెడ్డి,  ముప్పు శ్రీనివాస్‌రెడ్డి, సతీష్‌గౌడ్, సురకంటి నవనీత, సంజీవరెడ్డి, రామారావు, అశోక్‌యాదవ్,  వెంకటేష్‌, తటాకం అభిలాష్‌ మంచాల ప్రవీన్, రాములు , తదితరులు పాల్గొన్నారు. చదవండి: కారెక్కనున్న బట్టి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top