రూ. 2 వేల కోట్లు: చంద్రబాబుకు ‘లైవ్‌మింట్‌’‌ ఫోన్‌!

Livemint Seeks Chandrababu Response Over IT Raids But No Reply - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆదాయ పన్ను శాఖ సోదాలపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతవరకు నోరు విప్పకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి పెద్ద ఎత్తున రాద్దాంతం చేసే చంద్రబాబు.. ఐటీ సోదాల్లో రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము బయటపడిన విషయంపై మౌనం వీడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఐటీ దాడుల్లో గుర్తించిన రెండువేల కోట్ల అక్రమ లావాదేవీలపై శనివారం కథనం రాసిన లైవ్‌ మింట్‌ ఆంగ్ల పత్రిక చంద్రబాబును సంప్రదించినా ఆయన స్పందించలేదు. ఈ విషయాన్ని మింట్‌ వెబ్‌సైట్‌లో ఉన్న కథనంలో చంద్రబాబుకు పలుసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని పేర్కొన్నారు.

ఈ రెండు వేల కోట్లతో సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అడిగేందుకు చంద్రబాబు ఫోన్‌ కోసం ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీంతో ఇదే విషయంపై స్పందన కోరుతూ ఆయనకు ఈ-మెయిల్‌ పంపినా తిరుగు సమాధానం లేదని కథనంలో పేర్కొన్నారు. దీన్నిబట్టి చంద్రబాబు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా మీడియాతో మాట్లాడేందుకు చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. జాతీయ మీడియా అయితే ఇంకా ఆత్రంగా స్పందిస్తారని, కానీ ఐటీ దాడుల నేపథ్యంలో మాట్లాడేందుకు ముందుకు రావడంలేదని చెబుతున్నారు. (చంద్రబాబు అవినీతి: మచ్చుకు రూ.2,000 కోట్లు)

కాగా ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించిన వివరాలు లభ్యమైనట్లు ఐటీ శాఖ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక ప్రముఖుడి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐటీ దాడులపై స్పందించాల్సిందిగా లైవ్‌మింట్‌ ప్రతినిధులు చంద్రబాబుకు ఫోన్‌ చేసినట్లు తమ ఆర్టికల్‌లో పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా చంద్రబాబు స్పందించలేదని.. దీంతో టీడీపీకి ఈ- మెయిల్‌ పెట్టినట్లు తెలిపారు. రూ. 2 వేల కోట్లతో మీకు సంబంధం ఉందా? లేదా అని మెయిల్‌లో అడిగినట్లు సమాచారం. (ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు

ఇక ఐటీ దాడులపై చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోయినా.. తమపై బురద జల్లుతున్నారంటూ టీడీపీ ఎల్లో మీడియాలో ప్రెస్‌మీట్లు పెట్టీ మరీ ఊదరగొట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో వివరణ కోరిన.. లైవ్‌మింట్‌ ప్రతినిధులకు మాత్రం వారు సమాధానం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ- మెయిల్‌కు సంబంధించిన లైవ్‌మింట్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చంద్రబాబు అవినీతి బట్టబయలు

ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు
రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్కు చంద్రబాబు పయనం!

బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు

పవన్ ఎందుకు నోరు మెదడపడం లేదు?

లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది

చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో!

(చంద్రబాబు మాజీ పీఎస్ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top