ఏబీసీ అంటే ఏంటో తెలుసా రాహుల్‌ జీ!? | KTR Tweet On Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఏబీసీ అంటే ఏంటో తెలుసా రాహుల్‌ జీ!?

Aug 14 2018 9:09 PM | Updated on Aug 14 2018 9:11 PM

KTR Tweet On Rahul Gandhi - Sakshi

మీది ‘స్కాంగ్రెస్‌’ పార్టీ కదా. ఏ అంటే ఆదర్శ్‌..

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ టీఆర్‌ఎస్‌- ఎన్డీయే ప్రభుత్వాలపై చేసిన విమర్శలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ఘాటైన సమాధానమిచ్చారు. అవినీతి అంటూ గగ్గోలు పెడుతున్న రాహుల్‌ గాంధీకి.. ఏబీసీ అంటే ఏంటో తెలుసా అంటూ ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. 

‘రాహుల్‌ జీ మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి వేదికపై మీ చుట్టూ ఉన్న వాళ్ల గురించి తెలుసుకోండి. అందులో సగం మంది బెయిలుపై బయటున్నవారే. కొందరిపై సీబీఐ కేసులు ఉంటే, మరికొందరు అవినీతి కేసుల్లో కూరుకుపోయి ఉన్నారు. అయ్యో అసలు విషయం మర్చిపోయాను. మీది ‘స్కాంగ్రెస్‌’ పార్టీ కదా. ఏ అంటే ఆదర్శ్‌.. బీ అంటే బోఫోర్స్‌.. సీ అంటే కామన్‌వెల్త్‌గేమ్స్‌ కదా’ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బయటపడ్డ కుంభకోణాల గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కాగా తెలంగాణ పర్యటనలో భాగంగా నగరంలోని సరూర్‌నగర్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన ‘విద్యార్థి-నిరుద్యోగ గర్జన’సభలో టీఆర్‌ఎస్‌, ఎన్డీయే ప్రభుత్వాలను రాహుల్‌ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement