‘చంద్రబాబు గారి మరో ఆణిముత‍్యం’ | KTR Satire Tweets On AP CM ChandraBabu Naidu | Sakshi
Sakshi News home page

Oct 9 2018 7:14 PM | Updated on Oct 22 2018 6:13 PM

KTR Satire Tweets On AP CM ChandraBabu Naidu - Sakshi

ఆ ఇటాలియన్‌ మాఫియా రాజ్‌, చంద్రబాబు జిగ్రీ దోస్తులయ్యారు..

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో(2014 నాటి) కాంగ్రెస్‌పై చంద్రబాబు చేసిన ట్వీట్స్‌ స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేస్తూ మహాకూటమి పొత్తుపై నిలదీశారు.  కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పాలనకు ప్రజలు ముగింపు పలుకునున్నారని, ఈ విషయం తన ప్రజాగర్జన ద్వారా తెలిసిందని, ఇటాలియన్‌ మాఫియా రాజ్‌ కథ ముగిసిందని చంద్రబాబు అప్పట్లో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేస్తూ కేటీఆర్‌.. ‘ఆ ఇటాలియన్‌ మాఫియా రాజ్‌ అతను ఇప్పుడు జిగ్రీ దోస్తులయ్యారు. అతనెవరో చెప్పుకోండి? ఇప్పుడు తెలిసిందా నేను ‘మహాఘంటియాబంధన్‌’  అని ఎందుకు పిలుస్తానో’  అని  పేర్కొన్నారు.

‘రాహుల్‌, సోనియాలకు కొత్తగా తెలంగాణపై ప్రేమ పుట్టుకొచ్చింది. గతంలో కూడా తెలంగాణలో వారు పర్యటించారు. అప్పుడు తెలంగాణ అభివృద్దికి ఏం చేశారు.’ అని ప్రశ్నిస్తూ చంద్రబాబు చేసిన ట్వీట్‌ అప్పట్లో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను షేర్‌ చేస్తూ  కేటీఆర్‌ ‘బాబుగారి మరో జ్ఞాన ఆణిముత్యం.. స్కామ్‌కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌లు 2014 వరకు తెలంగాణ అభివృద్దికి చొరవ చూపలేదనకుంటే.. అప్పటి నుంచి ఇప్పటికి ఏం మారింది?’  అని మరీ పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావ్‌ అని చంద్రబాబును పరోక్షంగా ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌తో జతకడుతున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement