శ్రీధర్‌రెడ్డిని దీవించండి

Kotamreddy Sridhar Reddy Family Campaign in Nellore - Sakshi

రూరల్‌ నియోజకవర్గ ప్రజలను కోరుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి కుటుంబసభ్యులు

ఇంటింటి ప్రచారం ప్రారంభం    

నెల్లూరు(సెంట్రల్‌): నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ప్రజలను కుటుంబసభ్యులుగా భావించి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని దీవించాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు. శ్రీధర్‌రెడ్డిని మీ చేతుల్లో పెడుతున్నాం.. వచ్చే ఎన్నికల్లో దీవించండి అంటూ వారు బుధవారం రూరల్‌ నియోజవర్గంలో ప్రచారాన్ని  ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుటుంబసభ్యులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా శ్రీధర్‌రెడ్డి రాసిన లేఖను ప్రతి ఇంటికి తిరిగి అందజేస్తున్నారు. ఆయన్ను ఆశీర్వదించాలని కోరుతున్నారు.

ప్రజల్లోనే ఉంటున్నారు
శ్రీధర్‌రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశారు. అలాగే సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులకు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అక్కున చేర్చుకుని నేనున్నానంటూ చేయూతనిచ్చారు. వివిధ వర్గాలకు తన సొంత నిధులతో మౌలిక వసతుల కల్పించారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా ఎమ్మెల్యే చేసిన కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి దీవించాలని ప్రజలను కోరారు.

కుటుంబం అంతా ప్రజల్లోనే..
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కుటుంబం మొత్తం రూరల్‌ నియోజవర్గంలోని ప్రజల వద్దకు వెళుతున్నారు. ఎమ్మెల్యే సతీమణి సుజిత ఎల్లంటిలో, పెద్ద కుమార్తె హైందవి పెనుమర్తిలో, చిన్నకుమార్తె వైష్ణవి కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు వద్ద ప్రచారం చేశారు. అదే విధంగా పెద్ద అల్లుడు బాలానందరెడ్డి, చిన్న అల్లుడు నవీన్‌లు రూరల్‌ నియోజవర్గంలోని అర్బన్‌ డివిజన్‌ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. శ్రీధర్‌రెడ్డి తమ్ముడు గిరిధర్‌రెడ్డి సజ్జాపురంలో ప్రజలను కలిశారు. ఇప్పటివరకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కుటుంబసభ్యులు తమ ప్రాంతాలకు రావడంతో ప్రజలు మేమున్నామంటూ వారికి భరోసా ఇస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top