‘కాంగ్రెస్‌ మోసం చేసింది’ | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ మోసం చేసింది’

Published Mon, Nov 26 2018 4:08 AM

Kodandaram Comments On Congress Party - Sakshi

ఖిలా వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీ కొన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీగా అభ్యర్థులను నిలిపి మోసం చేసిందని, పొత్తు నిబంధనలు పాటించడం లేదని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆదివారం వరంగల్‌ విద్యానగర్‌ కాలనీలోని టీజేఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నాలుగేళ్లు రాచరిక పాలన చేసిన కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మహాకూటమి వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గాదె ఇన్నయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడని, నిరుపేద, అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కోదండరాం చెప్పారు.   

Advertisement
Advertisement