బీజేపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ భేటీ | KCR Meet BJP MLAs In Camp Office | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ భేటీ

Aug 28 2018 3:41 PM | Updated on Mar 29 2019 8:30 PM

KCR Meet BJP MLAs In Camp Office - Sakshi

కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ముగిసిన మరుసటి రోజే భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావిస్తున్న కేసీఆర్‌.. బీజేపీ ఎమ్మెల్యేలను మంగళవారం తన క్యాంపు ఆఫీసుకు పిలిపించుకున్నారు. కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి పిలవడంతో ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నేరుగా సీఎం ఆఫీసుకు వెళ్లారు.

కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, బీజేపీ ముఖ్య నాయకులు, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, అరుణ్‌ జైట్లీలను కలిసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మరుసటి రోజే బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement