తెలంగాణకు తీరని అన్యాయం: సీఎం కేసీఆర్‌

KCR explains agriculture issues in combined AP state - Sakshi

సాక్షి, హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో రైతులకు రూ. 8 వేల పెట్టుబడిపై సోమవారం ఉదయం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో తెలిపేందుకు వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై పాటలు రాయాల్సి వచ్చిందన్నారు. పల్లెల దుస్థితిపై కవులు పాటలు రాయాల్సిన పరిస్థితి వచ్చిందన్న సీఎం.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ గతి ఏమైందన్న ఉద్దేశంతోనే ఆ పాటలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు.

పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచే పాలమూరులో.. అనే పాటలు రాశారని గుర్తుచేశారు. పాలమూరు రైతులు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చెప్పారు. కరీంనగర్‌లో 65 శాతం వ్యవసాయం బోర్లపై ఆధారపడి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనడానికి ఇది నిదర్శనమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి ఇస్తుంటే విమర్శించడం తగదన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని విపక్ష సభ్యులకు సీఎం కేసీఆర్‌ సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top