కర్ణాటక స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం | Sakshi
Sakshi News home page

కర్ణాటక స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం

Published Fri, May 25 2018 12:36 PM

Karnataka Assembly Speaker Is Ramesh Kumar - Sakshi

సాక్షి, బెంగళూరు : గత కొన్ని రోజులుగా రిసార్టుల్లోనే ఉంటున్న కాంగ్రెస్-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. కాగా, బలపరీక్ష నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 12 గంటల అనంతరం కర్ణాటక అసెంబ్లీ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేఆర్‌ రమేష్ కుమార్ స్పీకర్‌ అయ్యారు. స్పీకర్‌గా సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అభ్యర్థి రమేష్‌ కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది.తొలుత స్పీకర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేఆర్‌ రమేష్ కుమార్‌ పేరును సిద్దరామయ్య ప్రతిపాదించారు. ఆ వెంటనే రమేష్‌ కుమార్‌ పేరును కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర బలపరిచారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే సురేష్‌ కుమార్‌ పోటీ నుంచి తప్పుకున్నారు.

సంఖ్యాబలం లేదని చర్చించుకున్న అనంతరం బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్‌ నేత రమేష్‌ కుమార్‌ మరోసారి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. 18 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి స్పీకర్‌ అయ్యారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం. నూతన స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ దగ్గరికెళ్లి మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో కుమారస్వామి సర్కార్‌ బలపరీక్ష ఎదుర్కోనుంది.

Advertisement
Advertisement