రాహుల్‌ గాంధీతో కమల్‌ భేటీ | Kamal Haasan Meets Rahul Gandhi In Delhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీతో కమల్‌ భేటీ

Jun 20 2018 8:05 PM | Updated on Jun 20 2018 8:34 PM

Kamal Haasan Meets Rahul Gandhi In Delhi - Sakshi

కమల్‌ హసన్‌- రాహుల్‌ గాంధీ

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ బుధవారం భేటీ అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాజకీయాల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రియాంక వాద్రాతో మర్యాదపూర్వకంగా సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు. తన పార్టీ మక్కల్‌ నీది మయ్యంను రిజిస్టర్‌ చేయించడం కోసం మంగళవారం ఎన్నికల సంఘం అధికారులను కూడా కమల్‌ కలిశారు.

కమల్‌తో భేటీ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఈరోజు ఢిల్లీలో కమల్‌ హసన్‌తో భేటీ అవడం సంతోషంగా ఉంది. మా రెండు పార్టీలకు సంబంధించిన విషయాల గురించి విస్తృతంగా చర్చించుకున్నాం. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి కూడా చర్చించామని’ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement