అన్నదాతల ఆత్మహత్యలపై చోద్యం | Julakanti ranga reddy commented over government | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఆత్మహత్యలపై చోద్యం

Apr 4 2018 3:10 AM | Updated on Oct 1 2018 2:36 PM

Julakanti ranga reddy commented over government - Sakshi

గజ్వేల్‌ రూరల్‌: దేశంలో నాలుగేళ్లలో 40 వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని మార్చి 24న ప్రారంభమైన బస్సుయాత్ర మంగళవారం రాత్రి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చేరుకుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్, ఆశయ్య, స్కైలాబ్‌ బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement