ఆ రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదు

JP Nadda Fires On Rahul Family Over India China Issue - Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

న్యూఢిల్లీ : తిరస్కరించబడిన, తొలిగించబడిన రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఓ రాజవంశం.. నిజాయితీ కలిగిన దాని అనుచరులు ప్రతిపక్షం అంటే ఆ రాజవంశమే అనే మాయలో ఉన్నారంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన ట్విటర్‌ వేదికగా రాహుల్‌ గాంధీ కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ రాజవంశం తంత్రాలు చేస్తుంది. అనుచరులు తప్పుడు ప్రచారాలతో రాళ్లు విసురుతారు. ఓ రాజవంశానికి చెందిన అభిప్రాయాలు భారత ప్రజల అభిప్రాయాలు కాదు. ఈ రోజు దేశం మొత్తం ఏకమై సైన్యానికి అండగా ఉంది. ఇది మనం ఏకమై సంఘీభావం తెలపాల్సిన సమయం. తొమ్మిదవ సారి వారసుడ్ని ప్రవేశపెట్టడానికి కొంచెం ఆగండి. (‘మన్మోహన్‌ హయాంలో చైనాకు లొంగిపోయారు’)

ప్రశ్నలు అడగటానికి ప్రతిపక్షానికి హక్కుంది. అఖిల పక్ష భేటీ ఎంతో చక్కగా జరిగింది. కొంతమంది ప్రతి పక్ష నేతలు తమ విలువైన సలహాలు ఇచ్చారు. కేంద్రం ముందుకు సాగటానికి తమవంతు మద్దతు తెలిపారు. కానీ, ఓ కుటుంబం మాత్రం కాదు. అది ఎవరో చెప్పగలరా?.. ఆ రాజవంశం కారణంగా వందల కిలోమీటర్ల భారత భూభాగాన్ని కోల్పోయాం. సియాచిన్‌ గ్లేసియర్‌ని‌ పూర్తిగా కోల్పోయే పరిస్థితి. అదే కాకుండా ఇంకా ఏన్నో.. ఆ రాజవంశాన్ని ప్రజలు పదవి నుంచి తొలిగించడంలో ఆశ్చర్యమేమీ లేదు’’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top