బడా జూటా పార్టీ బీజేపీ: జీవన్‌రెడ్డి | Jeevan reddy commented over bjp | Sakshi
Sakshi News home page

బడా జూటా పార్టీ బీజేపీ: జీవన్‌రెడ్డి

Jul 3 2018 2:14 AM | Updated on Jul 3 2018 2:14 AM

Jeevan reddy commented over bjp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అంటే బడా జూటా పార్టీ అని ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న జనచైతన్య యాత్రలు జనాలు లేక వెలవెలబోతున్నాయన్నారు. జనం లేని జన చైతన్య యాత్రల్లో బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

బీజేపీ అంటే ‘బడా జూటా పార్టీ’ అని పేరు మార్చుకుంటే మంచిదని సూచించారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ ఇక్కడ రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, మిషన్‌ భగీరథ కమీషన్‌ భగీరథ అయితే ప్రధాని మోదీ ఆ పథకాన్ని గజ్వేల్‌లో ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement