breaking news
janachaitanya yatralu
-
బడా జూటా పార్టీ బీజేపీ: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అంటే బడా జూటా పార్టీ అని ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న జనచైతన్య యాత్రలు జనాలు లేక వెలవెలబోతున్నాయన్నారు. జనం లేని జన చైతన్య యాత్రల్లో బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ అంటే ‘బడా జూటా పార్టీ’ అని పేరు మార్చుకుంటే మంచిదని సూచించారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ ఇక్కడ రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, మిషన్ భగీరథ కమీషన్ భగీరథ అయితే ప్రధాని మోదీ ఆ పథకాన్ని గజ్వేల్‌లో ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. -
శ్రీకాళహస్తి టీడీపీలో ముసలం
చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణ టీడీపీలో ముసలం పుట్టింది. ఛైర్మన్ రాధారెడ్డి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అధికార పార్టీ నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు గురువారం 15 మంది టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. వార్డుల్లో ఏ ఒక్కపని జరగడం లేదని వారు ఆరోపిస్తున్నారు. జనం వద్దకు ఏ మొహం పెట్టుకుని వెళ్లాలంటూ సదరు కౌన్సిలర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.