అందుకే పోటీ చేయడం లేదు: జనసేన | Jana Sena Clarification Over Telangana Assembly Election | Sakshi
Sakshi News home page

Nov 19 2018 5:24 PM | Updated on Mar 22 2019 5:33 PM

Jana Sena Clarification Over Telangana Assembly Election - Sakshi

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంపై జననేన పార్టీ వివరణయిచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంపై జననేన పార్టీ వివరణయిచ్చింది. నిర్దేశిత కాలపరిమితి కంటే ముందే ఎన్నికలు జరుగుతున్నందున పోటీ చేయడం లేదని తెలిపింది. ఈ మేర​కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గడువు ప్రకారం జరిగితే ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించుకున్నామని, ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్త పార్టీ అయిన జనసేనకు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement