పీసీపీ పదవికి వీహెచ్‌ అర్హుడే : జగ్గారెడ్డి

Jagga Reddy Says V Hanumantha Rao Eligible For PCC Post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పీసీసీ పదవికి సీనియర్‌ నేత వి. హనుమంతరావు అర్హుడేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. హైకమాండ్‌ బీసీలకు పీసీపీ ఇవ్వాలనుకుంటే వీహెచ్‌ సమర్థుడైన నాయకుడని జగ్గారెడ్డి చెప్పారు. బీసీలలో వీహెచ్‌ స్టార్‌ అని ప్రశంసించారు. వీహెచ్‌కి పీసీపీ ఇస్తే అన్ని విధాలా ఆయనకు సహకరిస్తానని తెలిపారు. పీపీసీ పదవిని ఎస్సీలకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తే దామోదర రాజనర్సింహకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రెడ్డిలలో పీసీసీ పదవి తనతో పాటు మిగతావారిలో ఎవరికిచ్చినా సమర్థవంతంగా పనిచేస్తారని జగ్గారెడ్డి అన్నారు. 

కాగా పీసీపీ పదవి తనకు ఇవ్వాలని జగ్గారెడ్డి అధిష్టానాన్ని కోరడంపై వీహెచ్‌ మండిపడ్డ విషయం తెలిసెందే. ఎప్పుడూ ఒకే సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న వారికే పీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను పార్టీలో సీనియర్‌ నేతనని, తనకే పీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top