పాసుబుక్‌లను పక్కన పెట్టొద్దు: పొంగులేటి | Issue passbooks to farmers: Congress MLC to govt | Sakshi
Sakshi News home page

పాసుబుక్‌లను పక్కన పెట్టొద్దు: పొంగులేటి

Oct 16 2017 6:04 AM | Updated on Sep 17 2018 8:11 PM

Issue passbooks to farmers: Congress MLC to govt  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూరికార్డుల ప్రక్షాళన పేరుతో రైతుల పాసుపుస్తకాలను ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పాసుపుస్తకాలను హోల్డ్‌ చేయకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆదివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు తమ పొలాలను అమ్ముకుంటారని, అయితే పాసుపుస్తకాలను హోల్డ్‌లో పెట్టడంతో రిజిస్ట్రేషన్లు కావడం లేదని అన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. వరుస వానలతో ధాన్యం తడిసిపోయిందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతుల నుంచి మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement