‘అతను దేశద్రోహి’ | Imran Khan Reply On Nawaz Sharif Comments | Sakshi
Sakshi News home page

‘అతను దేశద్రోహి’

May 13 2018 7:23 PM | Updated on May 13 2018 8:38 PM

Imran Khan Reply On Nawaz Sharif Comments - Sakshi

ఇమ్రాన్‌ ఖాన్‌ ( ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: ముంబై దాడులపై పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌​ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు. ముంబై దాడుల్లో పాకిస్తాన్‌ పాత్ర ఉందని, పాక్‌ తలచుకుని ఉండి ఉంటే 20/11 దాడులను అడ్డుకుని ఉండేదని నవాజ్‌ షరీఫ్‌ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

నవాజ్‌ షరీఫ్‌ తన కుమారుడి కంపెనీలోని అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ భాష మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయన్న షరీఫ్‌ వ్యాఖ్యలను ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తావించారు. తన సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. షరీఫ్‌ను మధ్యముగంలో రాజ్యద్రోహం చేసిన మీర్‌ జాఫర్‌తో పోల్చారు.

‘మీర్‌ జాఫర్‌ బెంగాల్‌ నవాబు సిరాజ్‌-ఉద్దౌలా సైన్యంలో సిఫాయిగా ఉండేవాడు. బ్రిటిష్‌వారితో రహస్యం ఒప్పందం కుదుర్చుకుని వారికి అనుకూలంగా వ్యవహరించి, 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్‌ ఓటమికి కారకుడయ్యాడు. షరీఫ్‌ కూడా మీర్‌ జాఫర్‌లా తన సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదులు అనుకూలంగా మాట్లాడుతున్నారు’. అని ఇమ్రాన్‌ ఖాన్‌ విమర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement