ఇక కశ్మీర్‌ వధువులను తెచ్చుకోవచ్చు

Haryana CM Manohar Lal Khattar Controversial comments on kashmir - Sakshi

హరియాణా సీఎం ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

చండీగఢ్‌: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు పరిణామాలపై స్పందిస్తూ ‘గతంలో బిహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకునేవారమని, ఇకపై కశ్మీర్‌ నుంచి అందమైన వధువులను తెచ్చుకోవచ్చు’అంటూ వ్యాఖ్యానించారు. ఫతేబాద్‌లో శనివారం లింగ నిష్పత్తిపై జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఆయన వ్యాఖ్యలు వివాదం కావడంతో, మీడియా తనను అపార్థం చేసుకుందంటూ తను అన్న మాటలను వీడియో ఆధారాలతో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాగా, హరియాణా ముఖ్యమంత్రివి హేయమైన మాటలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. కఠోరమైన ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ కూడా ఆ బలహీన మనస్తత్వం ఉన్న మనిషిపై ప్రభావితం చూపలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, ‘ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు కూడా అవమానంగా భావించాలి’అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top