తెలంగాణ నాశనమే బాబు విధానం

Harish Rao Slams AP CM Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో నీటి ప్రాజెక్టులను అడ్డుకొని రైతాంగం నోట మట్టికొట్టేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న ఏపీ సీఎం చంద్రబాబులో నరనరానా తెలంగాణ ద్వేషం జీర్ణించుకుపోయిందని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. తెలంగాణలో ఇప్పటికే అడ్రస్‌ లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీని ఈ ఎన్నికల్లో ఎంతో కొంత బతికించుకునేందుకు, తెలంగాణలో నీటి ప్రాజెక్టుల మనుగడను ప్రశ్నార్థకం చేసేందుకు మహాకూటమితో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అంటేనే తెలంగాణ ప్రజల్లో అనేక అనుమానాలున్నాయన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.

ఇక్కడి నీటి ప్రాజెక్టులు అక్రమమంటూ కేంద్రానికి, సీడబ్ల్యూసీ, ఇతర సంస్థలకు అనేక లేఖలు రాసి తెలంగాణపై ఆయన ద్వేషాన్ని అనేకమార్లు చాటుకున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పూర్తి చేస్తామన్న ప్రాజెక్టులు... ఆయన ఏపీ సీఎం కాగానే ఎలా అక్రమమయ్యాయని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో పంటలు ఎండిపోవాలి. పరిశ్రమలు మూతపడాలి. కరెంటు ఉండకుండా చేయాలి. ఇందుకు ఆయన అవలంబించని కుట్రే లేదు’’అంటూ చంద్రబాబుపై హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. తెలంగాణను విఫల ప్రయోగంగా చూపించడానికి ఆయన పాల్పడని ద్రోహం లేదన్నారు. తెలంగాణ నాశనమే బాబు విధానమని ఆరోపించారు.

తెలంగాణలో బాబు చేసిన ఉద్యమ ద్రోహాలకు క్షమాపణ చెప్పకుండా ఇక్కడ ఎన్నికల ప్రచారానికి ఎలా వస్తారని నిలదీశారు. ఏనాడైనా తెలంగాణ తల్లికి పూలదండ వేసిన మనిషా? అని ప్రశ్నించారు. బాబు చేసిన ద్రోహాలను, ఉద్యమ నాయకుడిగా స్థానిక ప్రజాప్రతినిధిగా ఎండగట్టే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు అరాచకాలకు ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తిని పక్కనబెట్టుకుని తెలంగాణ ప్రజలకు ఏ ముఖంతో ఓట్లు అడిగేందుకు వస్తారని కాంగ్రెస్‌ నాయకులను నిలదీశారు. తెలంగాణకు వ్యతిరేకంగా పన్నిన 19 కుట్రలకు సమాధానం చెప్పాలంటూ చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు. 

చంద్రబాబుకు హరీశ్‌ సంధించిన ప్రశ్నలివే.. 

 • శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన లేఖలో తెలంగాణకు 1,330 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఉమ్మడి ఏపీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు టీడీపీ నివేదిక ఇచ్చింది. దానికి అనుగుణంగానే ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుపడటం లేదా? 
 • పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం, దిండి, భక్త రామదాసు ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ లేఖలు రాయడం కుట్ర కాదా? పాలమూరును గతంలో దత్తత తీసుకొని ఇలాంటి చర్యలకు ఎలా పాల్పడతారు. మోదీతో కలసి పాల్గొన్న మహబూబ్‌నగర్‌ ఎన్నికల సభలో అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డిని పూర్తి చేస్తామని ప్రకటించి ఇప్పుడు లేఖలు రాయడం నిజం కాదా? 
 • తెలంగాణలో 37 లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుపై లేఖలతో విషం చిమ్మడం అబద్ధమా? కేంద్రం, కేంద్ర జలవనరులశాఖ, పర్యావరణ అనుమతులున్న ప్రాజెక్టు అక్రమమంటూ లేఖ రాయలేదా? 
 • పాలేరులో భక్త రామదాసు ప్రాజెక్టుకు అడ్డుపడి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పాలేరులో ఓట్లడుగుతారు? 
 • కేసీ కెనాల్‌ కోసం తుమ్మిళ్ల ప్రాజెక్టు వద్దనడం తెలంగాణపై చేసిన కుట్ర కాదా? అలంపూర్‌లో పోటీ చేసే మహాకూటమి అభ్యర్థి తుమ్మిళ్ల వద్దని ఓట్లడుగుతారా? 
 • కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు పెం చుకునే హక్కు తెలంగాణకు ఉన్నా దానిపైనా కేంద్రానికి లేఖలతో కొర్రీలా? సొంత రాష్ట్రంలో మా ప్రాంతానికి నీటి కేటాయింపులు చేసే హక్కు మాకు లేదా? ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న పాలమూరును తిరిగి ఎడారి చేయడానికి కుట్రలకు పాల్పడలేదా? 
 • పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల కేటాయింపులు చేయొద్దని లేఖ రాయడం తెలంగాణకు చేసిన ద్రోహం కాదా? కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు ఇచ్చినప్పుడు తెలంగాణపై ఎందుకు అభ్యంతరం? 
 • శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు నీళ్లు కేటాయించొద్దని అక్టోబర్‌ 9న లేఖ రాసి తాజా ద్రోహానికి ఒడిగట్టలేదా? శ్రీశైలం నీళ్లొచ్చే తెలంగాణ నియోజకవర్గాల్లో మహాకూటమి ఓట్లు ఎలా అడుగుతుంది? 
 • పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల, ముచ్చుమర్రి, గుండ్రేవుల, గాజులదిన్నె తదితర అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం వాస్తవం కాదా? వాటి డీపీఆర్‌లు తెలంగాణకు ఎందుకు పంపలేదు? 
 • తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే మోదీ పై ఒత్తిడి చేసి పోలవరం ఏడు మండలాలు కలుపుకుని తెలంగాణకు తొలి ద్రోహం చేయలేదా? 
 • పోలవరం ముంపు మండలాలతోపాటు 365 రోజులపాటు 60 శాతం పీఎల్‌ఎఫ్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేసే లోయర్‌ సీలేరు హైడల్‌ పవర్‌ ప్రాజెక్టును లాక్కొని తెలంగాణకు ఏటా రూ. 500 కోట్ల మేర నష్టం కలిగించట్లేదా? ఇది తెలంగాణకు చేసిన శాశ్వత నష్టం కాదా? 
 • విద్యుత్‌ పంపిణీ విషయంలో తెలంగాణపట్ల దుర్మార్గంగా వ్యవహరించలేదా? విభజన చట్టాన్ని గౌరవించకుండా తెలంగాణకు ఏపీ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా అన్యాయం చేయలేదా? తెలంగాణలో మొదటి ఏడాది కరెంటు కష్టాలకు బాబు కసాయితనం కారణం కాదా? 
 • తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలతో ఏపీ జెన్‌కో చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసి 2,465 మెగావాట్ల కరెంటును తెలంగాణకు ఇవ్వకుండా అడ్డుపడింది నిజం కాదా? 
 • మీ నిర్వాకం వల్ల తెలంగాణ బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేసి రూ. 4,557 కోట్ల నష్టపోవడం వాస్తవం కాదా? 
 • తెలంగాణకు కరెంటు ఇవ్వనని చెప్పి ఓపెన్‌ టెండర్లలో పాల్గొని తెలంగాణకు కరెంటు ఇస్తామని చెప్పడం దుర్మార్గం కాదా? 
 • తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ విద్యుత్‌ ఉద్యోగులను తీసుకోకపోవడంతో రాష్ట్రంపై ఇప్పటివరకు రూ. వెయ్యి కోట్ల భారం పడింది నిజం కాదా? 
 • హైదరాబాద్‌లో కేటాయించినా వాడుకోకోకుండా మేము భవనాలను అడిగితే నిరాకరించడం తెలంగాణపట్ల సంకుచిత ధోరణి కాదా? 
 • హైదరాబాద్‌ ఆస్తుల్లో వాటా అడగటం దురాశ కాదా? నిజాం నవాబుల కాలంలో కట్టిన చారిత్రక కట్టడాల్లోనూ వాటా కోరడం మీ దుర్నీతికి నిదర్శనం కాదా? 
 • విభజన మానని గాయం అని అనలేదా? ఇదే మాటను గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించి మీ కసి తీర్చుకోలేదా?  

మరిన్ని వార్తలు

12-11-2018
Nov 12, 2018, 02:28 IST
‘‘డబుల్‌ యాక్షన్‌ సినిమాలు హిట్‌ అవుతుంటాయి. ఎందుకు? మన అభిమాన నటుడు తెరపై ఒకరు కనిపిస్తేనే ఎంతో సంబరం! అలాంటిది...
12-11-2018
Nov 12, 2018, 02:19 IST
గల్ఫ్‌ కార్మికుల అంశం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ప్రచారాస్త్రంగా మారనుంది. ఉత్తర తెలంగాణలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల్ఫ్‌ కార్మికుల...
12-11-2018
Nov 12, 2018, 02:08 IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు రెండు వారాల ముందు 2014 ఏప్రిల్‌–మే మాసాల్లో రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి....
12-11-2018
Nov 12, 2018, 01:56 IST
జీవితాన్నంతా తాము నమ్మిన సిద్ధాంతానికే అర్పించారు. పార్టీకి కష్టం వచ్చిన ప్రతిసారీ మేమున్నామంటూ స్థైర్యాన్నిచ్చారు. కానీ తమ వంతు వచ్చేసరికి.....
12-11-2018
Nov 12, 2018, 01:43 IST
భారత రాజకీయాలు, ఎన్నికల్లో కులాల పాత్రను వేరుగా చూడలేం. ఈ ఒక్క రాష్ట్రానికి అది మినహాయింపు అని చెప్పలేం. చిన్న...
12-11-2018
Nov 12, 2018, 01:35 IST
వేలిపై సిరాచుక్క కనబడితే ఖబడ్దార్‌ అని మావోయిస్టులన హెచ్చరికలు ఓవైపు.. ఓటే వజ్రాయుధం, హక్కు అంటూ ఎన్నికల సంఘం, ఎన్జీవోల...
11-11-2018
Nov 11, 2018, 19:21 IST
సాక్షి, హైదరాబాద్‌ : మహాకూటమిలో ఏ పార్టీ ఏ స్ధానంలో పోటీ చేస్తుందన్న వివరాలు సోమవారం వెల్లడిస్తామని టీపీసీసీ చీఫ్‌...
11-11-2018
Nov 11, 2018, 17:09 IST
విజయం.. ఈ మూడక్షరాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో శ్రమించాలి. తీవ్రంగా కష్టపడాలి. విలువైన సమయాన్ని వెచ్చించాలి. ఒక్కోసారి జీవితాంతం పోరాడాలి....
11-11-2018
Nov 11, 2018, 16:51 IST
సాక్షి, హైదరాబాద్‌ : నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్‌ తెలంగాణను సర్వనాశనం చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి రాజీవ్‌...
11-11-2018
Nov 11, 2018, 16:14 IST
కొత్తూరు :  నోటాకు పోలయ్యే ఓట్లు తూటాల కంటే బలమైనవి. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం, ప్రమాదం ఉంది....
11-11-2018
Nov 11, 2018, 15:51 IST
సాక్షి,దామరచర్ల(మిర్యాలగూడ): ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ పెద్దలు ఉత్తమ్, జానా, కోమటిరెడ్డిలను ప్రజలు సన్యాసంలో కలిపేస్తారని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు....
11-11-2018
Nov 11, 2018, 15:23 IST
సాక్షి,నల్లగొండ: ముందస్తు ఎన్నికలు ఖరారైన రోజే తమ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకరోజు ముందే బీ–ఫారాలు ఇచ్చేందుకు...
11-11-2018
Nov 11, 2018, 15:13 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా : టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా జట్టుకట్టిన కూటమిలో కలకలం మొదలైంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం అధినేతలకు తలనొప్పిగా...
11-11-2018
Nov 11, 2018, 14:52 IST
సాక్షి,నల్లగొండ: ఇంకెప్పుడు..? సోమవారం నోటిఫికేషన్‌ కూడా వెలువడనుంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తరు..? వారెప్పుడు ప్రచారం చేసుకుంటరు..? ఇంకా పొత్తులు ఏమయ్యాయి,...
11-11-2018
Nov 11, 2018, 14:51 IST
నిర్మల్‌: రాష్ట్రంలో జనాభాపరంగా అధిక స్త్రీ, పురుష నిష్పత్తి కలిగిన జిల్లాగా నిర్మల్‌కు పేరుంది. ప్రతీ వేయిమంది పురుషులకు 1046మంది...
11-11-2018
Nov 11, 2018, 14:06 IST
వేమనపల్లి(బెల్లంపల్లి): మూడు రోజుల క్రితం బెల్లంపల్లిలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలియడం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో...
11-11-2018
Nov 11, 2018, 13:21 IST
సాక్షి, పటాన్‌చెరు : అసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్‌చెరు వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికుల...
11-11-2018
Nov 11, 2018, 13:19 IST
టికెట్‌ రాకపోయినా కొత్తగూడెం ప్రజలకు..
11-11-2018
Nov 11, 2018, 12:52 IST
కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎంపీ కవిత విమర్శించారు. టీఆర్‌ఎస్‌ హయాంలోనే...
11-11-2018
Nov 11, 2018, 12:29 IST
క్రిమినల్‌ కేసులుంటే.. అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉంటే వివరాలను అఫిడవిట్‌లో పొందు పర్చాలి. వాటి వివరాలను అభ్యర్థులు డిసెంబర్‌ 5వ తేదీలోగా...

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top