
సాక్షి, హైదరాబాద్ : ప్రజలకు ఎప్పుడు చేరువలో ఉండే మాజీ మంత్రి హరీశ్‌రావు తన అభిమానులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలను మన్నించాలని కోరారు. జూన్ 3వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్న హరీశ్ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. సోమవారం రోజున తాను సిద్ధిపేటలో కానీ, హైదరాబాద్‌లో కానీ ఉండటం లేదని తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వస్తామనుకున్నవారిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాల్సిందిగా ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు. నా పుట్టిన రోజు (జూన్-3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న నేను హైదరాబాద్‌లో కానీ, సిద్ధిపేటలో కానీ ఉండడంలేదు. ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంటున్నాను. మీ అభిమానానికి మరోసారి తలవొంచి నమస్కరిస్తున్నాన’ని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
— Harish Rao Thanneeru (@trsharish) June 2, 2019
ఆదివారం తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్ధిపేటలోని అమరవీరుల స్తూపం వద్ద హరీశ్‌రావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు.