‘బాబు, అచ్చెన్నాయుడు విచారణ తప్పించుకోలేరు’ | Gummanur Jayaram Fires On TDP And Atchannaidu Over ESI scamGummanur Jayaram Fires On TDP And Atchannaidu Over ESI scam | Sakshi
Sakshi News home page

‘బాబు, అచ్చెన్నాయుడు విచారణ తప్పించుకోలేరు’

Feb 22 2020 12:07 PM | Updated on Feb 22 2020 12:23 PM

Gummanur Jayaram Fires On TDP And Atchannaidu Over ESI scamGummanur Jayaram Fires On TDP And Atchannaidu Over ESI scam - Sakshi

మంత్రి గుమ్మనూరి జయరాం

సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ నేతలు జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి గుమ్మనూరి జయరాం అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు దోపిడీ చేసి తప్పించుకునేందుకు బీసీ కార్డు తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా చంద్రబాబు, అచ్చెన్నాయుడు అవినీతి విచారణ నుంచి తప్పించుకోలేరని ఆయన తెలిపారు. ఈఎస్ఐ స్కాంలో చంద్రబాబునాయుడికి కూడా వాటా ఉందని మంత్రి గుమ్మనూరి జయరాం ఆరోపించారు. కార్మికుల్లో అత్యధికులు బీసీలే ఉంటారని.. ​అలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్మికులను టీడీపీ నేతలు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. దొంగలకు  బీసీ, ఓసీ అనే తేడా ఉంటుందా అని అన్నారు.  చంద్రబాబు డబ్బున్న బీసీలను మంత్రులు చేస్తే.. జగన్‌ పేద బీసీలను మంత్రులను చేశారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్‌ కేబీనెట్‌లో అవకాశం కల్పించారని గుమ్మనూరి జయరాం తెలిపారు. (‘దోపిడీ జరిగింది వాస్తవం కాదా?’)
చదవండి:
 (అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు విడ్డూరం: విష్ణుకుమార్‌)

(కార్మికుల సొమ్ము  కట్టలపాము పాలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement