
సాక్షి, యాదాద్రి: ప్రతీ చిన్న విషయానికి ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఆరోపించారు. భువనగిరిలో విలేకరులతో మాట్లాడుతూ.. తపాసుపల్లి ద్వారా ఆలేరుకు నీటిని మళ్లించడానికి సాధ్యం కాదన్నారు. దీంతో తపాసుపల్లి నుంచి నీటి మళ్లింపు సాధ్యపడదని ప్రభుత్వ విప్ తెలిపారు.
గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు కాల్వల ద్వారా నీటిని మళ్లిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బుధవారం పర్యావరణ అనుమతులు లభించినందుకు చాలా సంతోషమన్నారు. బస్వాపూర్, గంధమల్ల, రిజర్వాయర్ల నిర్మాణం నిమిత్తం భూసేకరణ త్వరలోనే చెపడుతామని ప్రభుత్వ విఫ్ అన్నారు.