రాహుల్‌ కోసం 80 మంది | Ghulam Nabi Azad reacts on rahul gandhi elected congress president | Sakshi
Sakshi News home page

రాహుల్‌ కోసం 80 మంది

Dec 11 2017 4:58 PM | Updated on Mar 18 2019 7:55 PM

 Ghulam Nabi Azad reacts on rahul gandhi elected congress president - Sakshi

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నాయకత‍్వంలో కాంగ్రెస్‌ ఉన్నత శిఖరాలకు చేరుతుందని సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నాయకత‍్వంలో కాంగ్రెస్‌ ఉన్నత శిఖరాలకు చేరుతుందని సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనిక్కడ సోమవారం మాట్లాడుతూ రాహుల్‌ తన నాయకత్వ పటిమను ఇప్పటికే నిరూపించుకున్నారన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో ఒక్క రాహుల్‌ను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహా 80 మంది మంత్రులు ప్రచారం చేస్తున్నారని ఏద్దేవా చేశారు.

కాగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్‌ ముళ్లపల్లి రామచంద్రన్‌ సోమవారం ప్రకటన చేశారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా డిసెంబర్‌ 16 న బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement