గంభీర్‌కు నోటీసులు పంపిన కేజ్రీవాల్‌

Gautam Gambhir Gets Notice For Filth Mr CM Tweet - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బీజేపీ - ఆప్‌ పార్టీల మధ్య పాంప్లెట్ల వివాదం మరింత ముదిరింది. గంభీర్‌ తమ పార్టీ అభ్యర్థిని కించపరిచేలా పాంప్లెట్లు పంచాడని ఆప్‌ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆప్‌ ఆరోపణలపై స్పందించిన గంభీర్‌ రెండు రోజుల క్రితం కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ‘ఇలాంటి సీఎం ఉన్నందుకు సిగ్గుపడాలి’ అంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేజ్రీవాల్‌.. శనివారం గంభీర్‌కు లీగల్‌ నోటిసులు పంపారు. తన వ్యాఖ్యలకు గంభీర్‌ గంభీర్‌కు నోటీసులు పంపిన కేజ్రీవాల్‌రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. అంతేకాక తమ పార్టీపై గంభీనఖ చేసిన ఆరోపణలు తప్పని పేర్కొంటూ.. 24 గంటల్లోపు వాస్తవాలను వార్త పత్రికల్లో ప్రకటించాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో గంభీర్‌ పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేజ్రీవాల్‌ హెచ్చరించారు.

బీజేపీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి గౌతం గంభీర్‌ తనకు వ్యతిరేకంగా అసభ్యకరమైన పాంప్లెట్లు పంచుతున్నారంటూ ఆప్ నేత ఆతిషి ఆరోపించినప్పటి నుంచి గంభీర్ - ఆప్ నేతల మధ్య వివాదం మొదలైంది. చిన్నగా మొదలైన ఈ వివాదం రోజురోజుకు పెరిగి నోటీసులు పంపుకోవడం వరకు వెళ్లింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top