టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి గంటా, కేశినేని డుమ్మా

Ganta Srinivasa Rao And Kesineni Absent For TDP Review Meeting - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంగళవారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి జరుగుతున్న రాష్ట్ర స్థాయి సమావేశం ఇది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రావు, ఎంపీ కేశీనేని నాని గైర్హాజరయ్యారు. గత కొంత కాలంగా చంద్రబాబు తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.  పీఏసీ చైర్మన్‌ పదవి ఇవ్వకపోవడం పట్ల గంటా కోపంగా ఉండగా.. జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు వ్యహరశైలిపై ఎంపీ నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి ఈ ఇద్దరు అగ్ర నేతలు హాజరు కాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top