ఎన్నికల్లో సెంచరీ కొడతాం

Flipkart CEO Meets KTR - Sakshi

కాంగ్రెస్‌ కంచుకోటలు బద్దలు కొడతాం: కేటీఆర్‌ 

టీఆర్‌ఎస్‌లో పలువురు కాంగ్రెస్‌ నేతల చేరిక

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొడతామని మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటలు బద్దలు కొడతామన్నారు. అసలు ఆ పార్టీలో ఎవరిని చూసి ఓటెయ్యాలని మంత్రి ప్రశ్నిం చారు. కాంగ్రెస్‌ నేతలను దద్దమ్మలు, సన్నాసు లని ప్రగతి నివేదన సభలో తిట్టనందుకు వారు  బాధ పడుతున్నట్లు ఉందన్నారు. మంగళవారం కాంగ్రెస్‌కు చెందిన కామారెడ్డి ఎంపీపీ ఎల్‌.నర్సింగరావు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..గతంలో పార్టీని వీడినవారు తిరిగి రావడం సంతోషకరమని, తప్పిపోయిన పిల్లలు ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ విధానాలు, ప్రగతిని చూసి 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న నేతలు చేరు తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో జరిగిన అన్ని ఉప ఎన్నికలు.. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గెలిచిందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మరణించిన నియోజకవర్గాల్లోనూ సానుభూతిని అధిగమించి గెలిచామన్నారు. అయినా కాంగ్రెస్‌ నేతల్లో పులుపు చావలేదని వ్యాఖ్యానించారు.  

43 లక్షల పింఛన్లు ఇస్తున్నాం 
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం పెంచితే గబ్బర్‌సింగ్‌ అవుతాడా అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. తన సొంత నియోజకవర్గం అమేథీలో మున్సిపల్‌ వార్డులను కూడా రాహుల్‌గాంధీ గెలిపించుకోలేదని.. అలాంటి వ్యక్తి తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తాడా అని ప్రశ్నించారు.  కాంగ్రెస్‌లో అందరూ సీఎం అభ్యర్థులేనని.. ఎవరిని చూసి, ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకే కేసీఆర్‌ను గద్దెదించాలా అన్నారు. రైతుబంధు, కేసీఆర్‌ కిట్, మిషన్‌ భగీరథ లాంటి అద్భుత పథకాలు అమలు చేస్తున్నందుకు కేసీఆర్‌ను దించేయాలా అని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్‌ కుటుంబం వల్ల ఏం అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు.  

మళ్లీ కేసీఆరే సీఎం
రాష్ట్రంలో ఫ్లిప్‌కార్ట్‌ పెట్టుబడులు ప్రముఖ ఈ–కామర్స్‌ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి మంగళవారం మంత్రి కేటీఆర్‌ను బేగంపేట క్యాంపు కార్యాల యంలో కలిశారు. తెలంగాణలో తమ సంస్థ వ్యాపార అభివృద్ధితోపాటు రాష్ట్రంలో పెట్టనున్న పెట్టుబడులు, లభించనున్న ఉపాధి అవకాశాలను వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top