టీడీపీకి గుడ్‌బై చెప్పిన మరో కీలకనేత | EX MLA SCV Naidu Resigns To TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి భారీ షాక్‌.... వైఎస్సార్‌సీపీలోకి ఎస్సీవీ నాయుడు!

Mar 30 2019 5:13 PM | Updated on Mar 30 2019 6:02 PM

EX MLA SCV Naidu Resigns To TDP - Sakshi

సాక్షి, చిత్తూరు : సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి మరో భారీ షాక్‌ తగిలింది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్సీవీ నాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పారు. రేపు నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరతానని ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తల సూచల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు.  ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వల్ల గత ఐదేళ్లుగా అనేక అవమానాలకు గురయ్యానన్నారు. శ్రీకాళహస్తితో పాటు గూడూరులలో టీడీపీని చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement