టీడీపీలోకి చంద్రబాబును వద్దని చెప్పాం..

Errabelli Dayakar Rao Criticize Chandrababu Naidu - Sakshi

సాక్షి, వరంగల్‌ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత నమ్మక ద్రోహి, కుల పిచ్చి  ఉన్న నాయకున్ని తాను చూడలేదని తెలంగాణ మంత్రి ఎర్రబెల్ల దయాకర్‌ రావు అన్నారు. నమ్మక ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిని అప్పుడే టీడీపీలోకి తీసుకోవద్దని ఎన్టీఆర్‌కు చెప్పామని గుర్తుచేశారు. తమ అభిమాన నేత ఎన్టీఆర్‌ను వెన్నపోటు పొడిచి సీఎం అయ్యారని ఆరోపించారు. అబద్ధాలకు, నయవంచనకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రజలు చంద్రబాబుకు మంచి బుద్ది చెప్పాలని కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top