
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12 మంది ఉద్యోగులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. విశాఖపట్నం జిల్లా మండపేట, నెల్లూరు జిల్లా కోవూరు, సుళ్లురుపేట, నూజీవీడుల ఆర్వో, ఏఆర్వోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను అభియోగాల నమోదుతో పాటు, శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. కాగా, ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరికొంత మంది అధికారులపై కూడా ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.