బీజేపీకి కొత్త చిక్కులు | Disqualify Sriramulu From Contesting Polls Congress On EC | Sakshi
Sakshi News home page

బీజేపీకి కొత్త చిక్కులు

May 11 2018 4:05 PM | Updated on Mar 18 2019 9:02 PM

Disqualify Sriramulu From Contesting Polls Congress On EC - Sakshi

శ్రీరాములు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ నేత బల్లారి ఎంపీ శ్రీరాములుకు అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. గాలి జనార్ధన్‌ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని  సుప్రీంకోర్టు మాజీ సీజే కేజీ బాలకృష్ణన్‌ మేనల్లుడు శ్రీనిజన్‌కు లంచం ఇస్తున్నట్లుగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శ్రీరాములు వీడియోలు బయటకు రావడంతో అతన్ని పోటీ నుంచి అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. శ్రీరాములు ప్రస్తుతం సిద్దరామయ్య పై బాదామి నుంచి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.

శ్రీరాములును పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ తెలిపారు. శ్రీరాములు గాలిజనార్ధన్‌ రెడ్డికి ప్రధాన అనుచరుడని, ఓబులాపురం మైనింగ్‌ కేసులో శ్రీరాములుకి సంబంధం ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రేదేశ్‌, కర్ణాటక ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు గాలి జనార్ధన్‌రెడ్డి పలు కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీడియోలో ఉన్నది శ్రీరాములు కాదని, కాంగ్రెస్‌ దురుద్ధేశంతో ఫేక్‌ వీడియోలను సృష్టించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement