పోటీ ‘బొమ్మ’లాట కాదు.. నిజమే! | Congress Party Ticket to Toys Merchant in Odisha | Sakshi
Sakshi News home page

పోటీ ‘బొమ్మ’లాట కాదు.. నిజమే!

Mar 25 2019 7:36 AM | Updated on Mar 25 2019 7:36 AM

Congress Party Ticket to Toys Merchant in Odisha - Sakshi

ఈ ఫోటోలో కనిపిస్తున్నది ముక్తికాంత బిస్వాల్‌. ఒడిశాకు చెందిన 31 ఏళ్ల ఈ యువకుడి వృత్తి బొమ్మలు చేసి అమ్మడం. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రూర్కెలా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఇతనికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇతనికున్న అర్హతల్లా మోదీని చూసేందుకు కాలినడకన ఢిల్లీ వెళ్లడం! అవును. నిజమే.. అసలు విషయం ఏమిటంటే.. రూర్కెలాలోని జనరల్‌ ఆస్పత్రి స్థాయి పెంచుతానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారట. దాని సంగతి కనుక్కోవడానికి, పనిలో పనిగా మోదీని కలుసుకోవచ్చని బిస్వాల్‌ గత ఏడాది ఢిల్లీ యాత్ర పెట్టుకున్నాడు. రూర్కెలా నుంచి 71 రోజుల పాటు 1500 కిలోమీటర్లకుపైగా నడిచి ఢిల్లీ చేరుకున్నాడు. అయితే, మోదీ దర్శనం  మాత్రం కాలేదట. దార్లో కళ్లుతిరిగి పడిపోతే ఆగ్రాలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా పొందాడు. ఆ నడకే ఇప్పుడు బిస్వాల్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement