
బైరతీ సురేష్
బొమ్మనహళ్లి: బెంగళూరులో హెబ్బాళ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగడానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగానున్న బైరతీ సురేష్ తన పదవికి ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. శాసనమండలి సభాపతి డి.హెచ్.శంకరమూర్తిని కలిసి తన రాజీనామా లేఖను అందజేసినట్లు సురేష్ తెలిపారు.
ఈ ఎన్నికలో హెబ్బాళ నుంచి కాంగ్రెస్ టికెట్‌తో పోటీకి సిద్ధంగా ఉన్నానని, పార్టీ పెద్దలు టికెట్ ఇస్తారన్న నమ్మకం ఉందని, ఎమ్మెల్సీ పదవికి మరో మూడు నెలలు ఉండగానే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. కాగా, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ జాబితాను ప్రకటించలేదు. బైరతీ ఎలాగైనా తనకు టికెట్ దక్కించుకోవడానికి రాజీనామా అస్త్రాన్ని వదిలినట్లు సమాచారం.