
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ పనితీరుపై తాను చాలా అసంతృప్తిగా ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. అసెంబ్లీ లాబీలో గురువారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ‘అసెంబ్లీలో సీఎల్పీ పనితీరు, బయట పార్టీ వ్యవహార శైలిపై నాకు చాలా అసంతృప్తిగా ఉంది. పార్టీ బాగుంటేనే నేను బాగుంటా. కార్యకర్తగా ప్రస్తుత పరిస్థితిపై మధనపడుతున్నా’ అని సంపత్ కుమార్ అన్నారు.
తెలంగాణలో నియోజకవర్గాల పెంపుపై సీఎల్పీ నాయకుడు కె. జానారెడ్డి కూడా మీడియాతో చిట్‌చాట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. 2024 వరకు నియోజకవర్గాల పెంపు సాధ్యంకాదన్నారు. ఒకవేళ పెంచాలనుకుంటే చట్టసవరణ చేయాలని పేర్కొన్నారు.